తెలంగాణ

telangana

ETV Bharat / state

బాలికల వసతి హాస్టల్​లో కలుషిత ఆహారం కలకలం.. 20 మందికి తీవ్ర అస్వస్థత - Food Poison In kasturba Girls Hostel Mahabubabad

Food Poison In kasturba Girls Hostel Mahabubabad: మహబూబాబాద్ కస్తూర్బా బాలికల వసతి గృహంలో కలుషిత ఆహారం కలకలం సృష్టించింది. అక్కడ విద్యార్థినిలు వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. 50 మంది విద్యార్థినుల్లో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరో 30 మంది విద్యార్థినిలు స్పల్పంగా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. అధికారులకు సమాచారం ఇవ్వగా.. వారిని అక్కడే ప్రాథమిక వైద్యం అందించారు. కొంత మంది పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Food Poison In kasturba Girls Hostel
Food Poison In kasturba Girls Hostel

By

Published : Mar 9, 2023, 3:08 PM IST

బాలికల వసతి హాస్టల్​లో కలుషిత ఆహారం కలకలం.. 20 మందికి తీవ్ర అస్వస్థత

Food Poison In kasturba Girls Hostel Mahabubabad: మహబూబాబాద్‌ కస్తూర్బా బాలికల వసతి గృహంలో కలుషిత ఆహారం కలకలం రేపింది. వాంతులు, విరేచనాలతో విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. 50 మంది విద్యార్థినుల్లో 20 మందికి తీవ్ర అస్వస్థతకు గురి కాగా.. మరో 30 మంది స్వల్పంగా ఇబ్బంది పడ్డారు. అప్రమత్తమైన వసతి గృహం సిబ్బంది అధికారులకు సమాచారం ఇవ్వగా.. విద్యార్థినులకు అక్కడే ప్రాథమిక వైద్యం అందించారు.

Mahabubabad Kasturba Girls Dormitory: అయినప్పటికీ పరిస్థితి అలాగే ఉండటంతో.. వారిని హుటాహుటిన మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాత్రి టమాట కూరతో విద్యార్థినిలు అన్నం తిన్నారని, దాని తోనే వాంతులు, విరేచనాలు అయినట్లు భావిస్తున్నామని.. ఇప్పటి వరకు హాస్పిటల్​లో అందరి పరిస్థితి బాగానే ఉందని సీరియస్ ఏమీ లేదని వారు తెలిపారు. అధికారులు కారణాల కోసం ఆరా తీస్తున్నారు.

'పిల్లలు 7 గంటల సమయంలో కొంతమందికి వాంతులు అయినా కారణంగా.. డిపార్ట్​మెంట్​కి ఇన్ఫామ్ చేశాం. డాక్టర్ టీమ్​ని స్కూల్​కి రప్పించడం జరిగింది. వాళ్లు ప్రాథమిక చికిత్స చేస్తూ.. ఒక 10 మంది పిల్లలకు కొంచం వాంతులైన కారణంగా, బాడీ డీ హైడ్రెట్ అవుతుందని.. 10 మందిని ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇప్పుడైతే మిగిలినా అందరు పిల్లలు సేఫ్​గానే ఉన్నారు. ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు.. వాళ్లు చెక్ చేసి సివియారిటి దృష్ట్యా ఆసుపత్రికి తరలించడం జరుగుతోంది. ఇబ్బంది లేని పిల్లలకు ఇక్కడే ట్రీట్ చేస్తారు. నైట్ తిన్న అన్నం కొంచం డైజెస్టు కాలేదని మేము అనుకుంటున్నాం. ప్రస్తుతానికి డాక్టర్స్ చెక్ చేస్తే మనకి పూర్తి వివరాలు తెలుస్తాయి'. -భవాని, ప్రత్యేక అధికారి కస్తూర్బా బాలికల వసతి గృహం

'ఇవాళ మహబూబాబాద్ కస్తూర్బా బాలికల వసతి గృహం నుంచి 40 మంది విద్యార్థినిలు హాస్పిటల్​కి రావటం జరిగింది. అందరి పరిస్థితి కంట్రోల్​లోనే ఉంది. ఎవరు అంతా భయపడాల్సిన పని ఏమీ లేదు. సాయంత్రం డిన్నర్ చేసిన తరువాతనే ఇలా జరిగిందని వారు చెప్తున్నారు. ఇప్పటికీ దాదాపు 40 మంది విద్యార్థినిలు వచ్చారు. వాళ్ల అందరికీ మేము ట్రీట్​మెంట్​ను అందిస్తున్నాం. వారికి ఎవరికి కూడా సీరియస్ అయితే కనిపించలేదు'. -వైద్యులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details