కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని... పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలులో భాజపా, తెరాస వైఫల్యం చెందాయని విమర్శించారు. సీనియర్ నేత హనుమంతరావు, అభ్యర్థి రాములు నాయక్‌తో కలసి ఉత్తమ్.. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులు, అధ్యాపకులను కలసి ఓట్లు అభ్యర్ధించారు.
విద్యార్థులను మోసం
ఎమ్మెల్సీ ఎన్నికలు భాజపా, కాంగ్రెస్‌లకు ఈసారి షాక్ ఇస్తాయని ఉత్తమ్ జోస్యం చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలు గల కేయూ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించలేదని ఆరోపించారు. వర్శిటీల్లో సమస్యలు పరిష్కరించకుండా విద్యార్థులను దగా చేశారని ధ్వజమెత్తారు. నిరుగ్యోగులకు ఉపాధి కల్పన విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అభ్యర్ధి రాములునాయక్ విమర్శించారు. ప్రశ్నించే గళం తమదేనని.. నూటికి నూరు శాతం ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని రాములు నాయక్ ధీమా వ్యక్తం చేశారు.