Teacher suspended In Mahabubabad District: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో జిల్లా కలెక్టర్ శశాంక్ పర్యటించారు. తొలుత లోక్యతండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్లి పలు రికార్డులు తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతంతో పాటు వివరాలు ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. తరగతుల వారీగా ఎంతమంది విద్యార్థులు ఉన్నారో ప్రధానోపాధ్యాయుడిని అడగగా.. సరైన సమాధానం చెప్పకపోవడంతో.. అతడిని సస్పెండ్ చేశారు.
వివరాలు చెప్పలేదని హెడ్ మాస్టర్ సస్పెండ్.. ఎక్కడంటే! - collecter visit in Mahabubabad district
Teacher suspended In Mahabubabad District: పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారో చెప్పలేకపోయినందుకు హెడ్మాస్టర్ను సస్పెండ్ చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని నర్సింహులపేట మండలంలో జిల్లా కలెక్టర్ శశాంక్ పర్యటించి ఓ స్కూల్ రికార్డులు తనిఖీ చేశారు. వివరాలు సరిగా చెప్పనందుకు హెడ్మాస్టర్ను అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. అదే గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో పనులు సరిగా చేపట్టనందుకు డబ్బులు రికవరీ చేయాలని కూడా ఆదేశించారు.
ఆ వివరాలు చెప్పలేదని టీచర్ సస్పెండ్.. ఎక్కడంటే!
తరువాత మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.4.35 లక్షలతో చేపట్టిన పనులు సక్రమంగా చేయకపోవడంతో.. రికవరీ చేయాలంటూ.. కలెక్టర్ జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు.
ఇవీ చదవండి: