తెలంగాణ

telangana

ETV Bharat / state

'భూ సంబంధిత సేవలు పారదర్శకంగా అందుతాయి'

ధరణి పోర్టల్​ ద్వారా ప్రజలకు భూ సంబంధిత సేవలు పారదర్శకంగా అందుతాయని కలెక్టర్​ రాజీవ్​ గాంధీ హనుమంతు పేర్కొన్నారు. రేపటి నుంచి జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలు స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.

collector rajiv gndhi hanmanthu on dharani portal
'భూ సంబంధిత సేవలు పారదర్శకంగా అందుతాయి'

By

Published : Nov 1, 2020, 9:02 PM IST

నవంబర్ 2 నుంచి జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలు స్లాట్ బుక్ చేసుకోవాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియను వ్యక్తిగతంగా చేసుకోని వారు మీ-సేవా కేంద్రాల ద్వారా రూ. 200లు చెల్లించి చేసుకోవాలని సూచించారు.

స్లాట్ బుకింగ్ సమయంలో అనుకూలమైన సమయం, తేదీ నిర్ధారించుకునే వెసులుబాటు ఉంటుందని.. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత రసీదు అందజేస్తారని కలెక్టర్​ వివరించారు. గతంలో లాగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా.. ధరణి ద్వారా ప్రజలకు పారదర్శకంగా భూ సంబంధిత సేవలు అందుతాయని తెలిపారు.

జిల్లాలో మీ-సేవా సెంటర్లు, కామన్ సర్వీస్ సెంటర్లు కలిపి సుమారు 125 వరకు ఉన్నాయని.. వాటి ద్వారా సేవలు పొందవచ్చని సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేసే మీ-సేవా కేంద్రాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతుందని, ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్​ వివరించారు.

పది రెట్లు ఇస్తామని చెప్పారు.. రూ.​ 24 లక్షలు దండుకున్నారు​!

ABOUT THE AUTHOR

...view details