వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిని కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ తనిఖీ చేశారు. ప్రతి వార్డులో తిరుగుతూ రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రి ఆవరణలో అన్నపూర్ణ క్యాంటిన్ అధికారులతో కలిసి భోజనం చేశారు.
హన్మకొండ ప్రసూతి ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే - ప్రభుత్వ ఆస్పత్రి
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అన్ని సమస్యలు పరిష్కరించి మెరుగైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.
హన్మకొండ ప్రసూతి ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే
రాష్ట్రంలో విద్యా, వైద్యంపై సీఎం ప్రత్యేక శ్రద్ధ పెట్టారని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా స్థాయిలో అందుబాటులో ఉన్న వనరులతో చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.
......