Clay Ganesh Idols Telangana : హనుమకొండ జిల్లా పోచమ్మ కుంటకు చెందిన వెంకన్న కుటుంబం కులవృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. వీరు వేసవి కాలంలో రంజాన్లను... వర్షాకాలంలో పూల కుండీలను తయారు చేస్తుంటారు. వినాయక చవితికి రెండు నెలల ముందు నుంచి మట్టి విగ్రహాలను తయారు చేయడంలో నిమగ్నమౌతుంటారు. దాదాపు పదేళ్లుగా పర్యావరణ పరిరక్షణలో తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ.. మట్టి గణపతులను తయారు చేస్తున్నారు. బంక మట్టినుపయోగించి విభిన్న రకాల ఆకృతుల్లో ఈ విగ్రహాలను తయారు చేస్తున్నారు.
Eco Friendly Ganesh Making Siddipet : మట్టి విగ్రహాలకు ఆదరణ పెరుగుతుండటంతో పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేకుండా సహజంగా రంగులను ఉపయోగించి గత పది సంవత్సరాలుగా మట్టి గణపతులను తయారు చేస్తున్నానని వెంకన్న తెలిపారు. పీవోపీ విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేయడం వల్ల జీవరాశులకు ముప్పు వాటిల్లుతుందని అన్నారు . మట్టి గణపతుల తయారీకి తన కుటుంబ సభ్యులు ఎంతగానో సహకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎలాంటి లాభాలను ఆశించకుండా మట్టి విగ్రహాలను తయారుచేసి నిర్వాహకులకు అందించడంలో తమ వంతు పాత్ర పోషించడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఏడాది పొడవునా సాఫ్ట్ వేర్ రంగంలో బిజీగా ఉన్నప్పటికీ పది రోజులపాటు సెలవులు పెట్టి.. తండ్రికి సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని వెంకన్న కుమారుడు పూర్ణచందర్ పేర్కొన్నారు.
"రంజాన్ సమయంలో నీటి కుండలు, వర్షాకాలంలో పూల కుండీలు తయారు చేస్తాం. వినాయకు చవితి వచ్చినప్పుడు విగ్రహాలను తయారు చేస్తాం. ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలను పూజించాలి పర్యవరణాన్ని సంరక్షించాలి. రంగు వినాయకులను వాడకూడదు. బంకమట్టితో మేము విగ్రహాలను చేస్తున్నాం. ఇవి పర్యావరణానికి ఎలాంటి కీడు కలిగించవు. ". - వెంకన్న మట్టి గణపతి తయారుదారు