విహారయాత్ర కోసం వెళ్లి గోదావరిలో ప్రమాదానికి గురైన వారి కుటుంబాలను ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ పరామర్శించారు. ఆయన వెంట వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మర్రి యాదవరెడ్డి తదితరులు వెళ్లారు. బాధిత కుటుంబాల ఇంటింటికి వెళ్లి వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఒకే గ్రామానికి చెందిన తొమ్మిది మంది ప్రమాదం బారిన పడడం తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు వినయ్ భాస్కర్. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఐదు లక్షల నష్టపరిహారం ఇవ్వనుందని తెలిపారు.
బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు చీఫ్‌విప్ పరామర్శ
తూ.గో జిల్లాలో జరిగిన బోటు ప్రమాదానికి గురైన జిల్లాకు చెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.
బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు చీఫ్‌విప్ పరామర్శ
TAGGED:
CHIEF WHIP PARAMARSHA