అక్కా అని పిలుస్తూనే తన కూతురిని అతి కిరాతకంగా హత్య చేశాడని... హన్మకొండ రామ్‌నగర్‌లో షాహిద్ అనే యువకుడి చేతిలో హత్యకు గురైన యువతి తల్లి తెలిపింది. తన కూతురు చదువుకునే రోజుల్లోనే ఆ యువకుడితో తమకు పరిచయమైందన్నారు. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ... కొడుకులా మెదిలే వాడని తెలిపింది.
'అక్కా అంటూనే... హతమార్చాడు' - called as sister and then killed my daughter
ఇంట్లో మనిషిలా మెదిలే వాడు ఇలాంటి దారుణానికి ఒడిగడతాడని ఊహించలేదని... హన్మకొండ మృతురాలి తల్లి ఆరోపించింది. అక్కా అంటూనే... మనుసులో ఇలాంటి ఆలోచనలు పెట్టుకుంటాడనుకోలేదని విలపించింది.
'అక్కా అంటూనే... హతమార్చాడు'
కానీ మనసులో చెడు ఆలోచన పెట్టుకొని... ఇంతటి దారుణానికి పాల్పడతాడనుకోలేదని విలపించింది. హంతకుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : గ్యాస్ కంపెనీలో పేలుడు... ఆరుగురు మృతి
Last Updated : Jan 11, 2020, 4:57 PM IST