గుజరాత్లో ఘోర ప్రమాదం జరిగింది. వడోదర గవాసద్లోని ఎయిమ్స్ మెడికల్ గ్యాస్ తయారీ పరిశ్రమలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికిపైగా గాయపడ్డారు. ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.
ఇదీ చదవండి:విద్యుత్తు కంచెను దాటేందుకు గజరాజు విశ్వప్రయత్నం