తెలంగాణ

telangana

ETV Bharat / state

నీటిలో మునిగి విద్యార్థి మృతి - warangal urban district

ఈతకని వెళ్లి పదోతరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన వరంగల్​ అర్బన్​ జిల్లా సాయిపేట గ్రామంలో జరిగింది. దేవాదుల ఓపెన్​ కాలువలో మునిగి గణేష్​ అనే విద్యార్థి మృతి చెందాడు.

boy died in devadhula open canal in warangal urban district
నీటిలో మునిగి విద్యార్థి మృతి

By

Published : May 14, 2020, 8:56 PM IST

నీటిలో మునిగి పదోతరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన వరంగల్ అర్బన్​ జిల్లా ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామంలో చోటు చేసుకుంది. గంగారపు గణేష్ అనే పదోతరగతి విద్యార్థి అతని మిత్రుడు కిరణ్​తో కలిసి గ్రామంలోని దేవాదుల ఓపెన్ కాలువలోకి ఈతకు వెళ్లాడు. లోతు తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో మిత్రులిద్దరూ కాలువలోకి దూకిన క్రమంలో లోతు ఎక్కువగా ఉండడం వల్ల గణేష్ ఈతరాక నీటిలోనే మునిగిపోయాడు.

మిత్రుడు కిరణ్ పరుగెత్తుకొని వెళ్లి చుట్టుపక్కల బావుల వద్ద ఉన్న వారికి సమాచారం అందించారు. స్థానికులు గణేష్​ని వెతికి బయటకు తీసినప్పటికీ అప్పటికే అతను మరణించాడు. గణేష్ మృతిచెందిన విషయం తెలుసుకొని తల్లిదండ్రులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు.

ఇవీ చూడండి: విషాదం మిగిల్చిన ఈత సరదా

ABOUT THE AUTHOR

...view details