తెలంగాణ

telangana

ETV Bharat / state

బోటు ప్రమాదం: తమ వారి ఆచూకీ తెలియక గ్రామస్థుల్లో ఆందోళన

బోటు ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ కోసం... వరంగల్‌ జిల్లాలోని కడిపికొండ తల్లడిల్లుతోంది. సమయం గడుస్తున్న కొద్దీ వారి రాకపై ఆందోళన నెలకొంటున్నా... కచ్చితంగా వస్తారని బలంగా విశ్వసిస్తున్నారు. క్షేమంగా తిరిగి రావాలని కుటుంబీకులు భగవంతుడిని ప్రార్ధిస్తున్నారు.

బోటు ప్రమాదం: తమ వారి ఆచూకీ తెలియక గ్రామస్థుల్లో ఆందోళన

By

Published : Sep 16, 2019, 4:42 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం, కడిపికొండ గ్రామం కన్నీటి పర్యంతమౌతోంది. గోదావరి దుర్ఘటనను తలుచుకుంటూ.... ఊరు ఊరంతా తల్లడిల్లుతోంది. ఎవరిని కలిసినా... బోటు ప్రమాదంలో తమ వారి జాడ కోసం ఆరాతీయడం కలచివేస్తోంది. 24 గంటలు గడిచినా..ఆచూకీ తెలియకపోవటం వల్ల కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఏం జరిగిందో తెలియక.... ఆవేదన చెందుతున్నారు. ఇదే దుర్ఘటనలో చనిపోయిన బస్కే అవినాష్, బస్కే రాజేందర్ కుటుంబ సభ్యులు రోదన గ్రామంలో మిన్నంటుతోంది.

కష్ట సుఖాల్లో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ... అంతా ఓ కుటుంబంలా ఉంటున్నవారిలో బోటు ప్రమాదం కోలుకోలేని విషాదాన్ని నింపింది. ఊరందరికీ ఇది ఎప్పటికీ తీరని కష్టం నష్టంగా మిగిలిపోతుందని గ్రామస్థులు వాపోతున్నారు.

బోటు ప్రమాదం: తమ వారి ఆచూకీ తెలియక గ్రామస్థుల్లో ఆందోళన


ఇవీచూడండి: లాంచీ ప్రమాద ఘటనలో పర్యటకుల వివరాలివే...!

ABOUT THE AUTHOR

...view details