తెలంగాణ

telangana

ETV Bharat / state

కాలయాపన ఆపండి... తక్షణమే సాయం అందించండి: సంజయ్ - Bjp MP Bandi Sanjay

వరంగల్​ జిల్లా ఎల్కతురుతి మండల పరిధిలోని సూరారం గ్రామంలో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్​ పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. రైతులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

BJP State President Bandi Sanjay tour Warangal Rural District
వరంగల్ పట్టణ జిల్లాలో బండి సంజయ్​ పర్యటన

By

Published : Oct 20, 2020, 3:44 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. పంట నీట మునిగిన పొలంలో పడి.. ఏడుస్తున్న రైతు రాజయ్యను ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు.

ఆరు సంవత్సరాలుగా అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్రప్రభుత్వం కమిటీలు, సర్వేల పేరుతో కాలయాపన చేస్తూ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా భూసార పరీక్షలు సమగ్రంగా నిర్వహించకుండా రైతాంగాన్ని సన్న వరి పండించాలని చెప్పి, ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తన ఫాం హౌస్​లో భూమిని సర్వే చేయించుకొని దొడ్డు వడ్లను పండిస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని సన్న వరి పండించాలని చెప్పింది. దొడ్డు వడ్లు ఎకరానికి 40 బస్తాలు వస్తే, సన్నపు వడ్లు ఎకరానికి 30 బస్తాలు మాత్రమే వస్తాయని ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి సన్నపు వడ్లు పండించి అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం కనీస మద్దతు ధరతో పాటు క్వింటాల్​కు రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు.

ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు వచ్చినప్పుడు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్​ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేస్తే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు సంభవించి రైతులు పంట నష్ట పోయినపుడు రైతుతో ఒప్పందం కుదుర్చుకున్న వారే పంట నష్టాన్ని భరిస్తారని తెలిపారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details