తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓరుగల్లులో కాంగ్రెస్​, కాషాయం నేతలు మాట కలిపారు

ఎన్నికల వేడిలో ఉక్కపోతకు గురవుతున్న నేతలు ఒకరికొకరు ఎదురయ్యారు... మాట కలిపారు... ఒకరినొకరు అప్యాయంగా కౌగిలించుకున్నారు. వరంగల్​ కలెక్టరేట్ ఇందుకు వేదికైంది. నామినేషన్​ వేసేందుకు వచ్చిన భాజపా, కాంగ్రెస్​ అభ్యర్థులు చింతా సాంబమూర్తి, దొమ్మాటి సాంబయ్య ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకున్నారు.

కాంగ్రెస్​, కాషాయం అభ్యర్థులు మాట కలిపారు

By

Published : Mar 25, 2019, 5:12 PM IST

కాంగ్రెస్​, కాషాయం అభ్యర్థులు మాట కలిపారు
మాటల తూటాలు... ఆరోపణల బాణాలు... ర్యాలీలు, బహిరంగ సభలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో దాదాపు ఎక్కడ చూసినా ఇవే చిత్రాలు... కానీ ఓరుగల్లు ఓ చిన్న పలకరింపులకు వేదికైంది. వరంగల్​ పార్లమెంట్​ నామినేషన్ల ఘట్టంలో కాంగ్రెస్​, భాజపా అభ్యర్థులు మాటకలిపారు. కలెక్టర్​ కార్యాలయంలో నామినేషన్​ దాఖలు చేసిన అనంతరం కాంగ్రెస్​ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య బయటకి వస్తుండగా.. అదే సమయంలో అటువైపు వస్తున్న భాజపా అభ్యర్థి చింతా సాంబమూర్తి ఎదురయ్యారు. ఇద్దరు నవ్వుతూ పలకరించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details