వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయంలో భాజపా కార్యకర్తలు చేపట్టిన ఎన్నికల ప్రచారం చర్చనీయాంశంగా మారింది. శివరాత్రి రోజు దైవ దర్శనానికి వచ్చిన భక్తులకు భాజపా కార్యకర్తలు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కరపత్రాలను పంచారు. దీనిపై భక్తులు.. ఆలయం ఆవరణలో ఎన్నికల ప్రచారం చేయడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు.
గుడిలో ఎన్నికల ప్రచారం చేసిన భాజపా - వేయి స్తంభాల ఆలయం
వరంగల్ వేయిస్తంభాల ఆలయంలో భాజపా కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుడిలో కరపత్రాలు పంచడంపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు.
గుడిలో ఎన్నికల ప్రచారం చేసిన భాజపా