పేదల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ పది కాలాలపాటు చల్లగా ఉండాలని భద్రకాళి అమ్మవారిని వేడుకున్నట్లు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. వరంగల్ భద్రకాళి అమ్మవారికి ముందుగా బతుకమ్మ చీరని కానుకగా సమర్పించిన ఆమె అనంతరం అర్హులైన పేదలకు గుడిలో చీరలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండా ప్రకాష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్వరాష్ట్రం అనంతరం తెలంగాణ ఆడపడుచులకు అన్నగా, మేనమామగా తండ్రిగా కేసీఆర్ అండగా ఉంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు.