అయ్యప్ప జననంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత్ నాస్తిక్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేశ్‌కు వికారాబాద్ జిల్లా కొడంగల్ కోర్టు.. 20 రోజుల రిమాండ్ విధించింది. నిందితుడిని పరిగి జైలుకు తరలించారు. ఈ నెల 19న హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్‌పై కొడంగల్ పీఎస్ సహా రాష్ట్రంలోని పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నరేశ్ వ్యాఖ్యలను నిరసిస్తూ మూడు రోజుల నుంచి అయ్యప్ప స్వాములు ఆందోళనలు చేస్తున్నారు. వెంటేనే అతడిని అరెస్ట్ చేయాలని.. పీడీ యాక్టు పెట్టాలని డిమాండ్ చేశారు.
అయ్యప్పస్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ అరెస్ట్.. 20 రోజుల రిమాండ్ - భారత నాస్తిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేశ్
12:17 December 31
హనుమకొండ జిల్లాలో బైరి నరేశ్ అరెస్ట్
స్వాముల ఆందోళనలు ఉద్ధృతం కావడంతో పోలీసులు నరేశ్ కోసం తీవ్రంగా గాలించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బైరి నరేశ్‌ను అరెస్ట్ చేశారు. వికారాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం.. హనుమకొండ టాస్క్‌ఫోర్స్ పోలీసుల సాయంతో.. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు గ్రామ పంచాయతీ రాములపల్లెలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కొడంగల్‌కు తరలించి.. కోర్టులో హాజరుపరిచారు. జడ్జి నరేశ్‌కు 20 రోజుల రిమాండ్ విధించగా.. బైరి నరేశ్‌ను పరిగి జైలుకు తరలించారు.
ఇవీ చదవండి:మహేందర్‌రెడ్డి ఎమోషనల్... విధుల నిర్వహణలో పడి వారిని నిర్లక్ష్యం చేశానంటూ...
నగర పంచాయితీ ఎన్నికల్లో 'మెడికో' సత్తా.. మాజీ ఎంపీ భార్యపై విజయం.. 21 ఏళ్లకే చీఫ్ కౌన్సిలర్‌గా..