వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని కాశిబుగ్గలో అయ్యప్ప పల్లకి సేవ అంగరంగ వైభవంగా సాగింది. గురుస్వామి పూల మహేష్ ఆధ్వర్యంలో కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం వద్ద మణికంఠునికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు.
అంగరంగ వైభవంగా సాగిన అయ్యప్ప పల్లకి సేవ - తెలంగాణ వార్తలు
వరంగల్ నగరంలో అయ్యప్ప పల్లకి సేవ అంగరంగ వైభవంగా సాగింది. మహిళలు మంగళహారతులతో స్వామికి స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు భజన కీర్తనలతో పరిసరాల్ని హోరెత్తించారు.
అయ్యప్ప పల్లకి సేవ
అనంతరం పల్లకిపై స్వామివారిని ఊరేగించారు. పల్లకిపై వస్తున్న హరిహరపుత్ర అయ్యప్ప స్వామికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అయ్యప్ప స్వాముల భజన కీర్తనలతో పరిసరప్రాంతాలు మారుమోగాయి.
ఇదీ చదవండి:ఈసారి జకార్డ్ అంచు డిజైన్లతో బతుకమ్మ చీరలు