లంచం తీసుకుని తిరిగి ఇంటి యజమానికి అప్పగిస్తూ అవినీతి నిరోధక శాఖకు దొరికిన ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. హన్మకొండలోని నయీమ్ నగర్లో ఓ భవన యజమాని నుంచి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ బాబు, చైన్‌మెన్ రమేశ్ 9 వేల లంచం డిమాండ్ చేశారు. ఇంటి యజమానికి అన్ని అనుమతులు ఉన్నా.. పని సాగనీయకుండా ఇబ్బందులకు గురి చేశారు. దీనితో ఏం చేయాలో తెలియని ఆ యజమాని అధికారులు అడిగినంత ముట్ట చెప్పారు. అనంతరం బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ బాబు తీరును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి.. ఇరువురిపై ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన అధికారులు ప్రవీణ్‌ను మందలించారు. లంచంగా తీసుకున్న 9 వేలను ఇంటి యజమానికి ప్రవీణ్ అప్పగిస్తుండగా.. అనిశా అధికారులు చాకచక్యంగా వీడియోలను రహస్యంగా చిత్రీకరించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ కావడం వల్ల వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ రవి కిరణ్ ఇరువురిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
లంచం తిరిగి ఇస్తుండగా పట్టుకున్న అనిశా - 9 వేల లంచం డిమాండ్
తీసుకున్న లంచాన్ని తిరిగి ఇస్తున్న అధికారిని అనిశా పట్టుకుంది. అన్ని అనుమతులు ఉన్న ఓ ఇంటి యజమాని నుంచి 9 వేలు లంచం డిమాండ్ చేసిన బిల్డింగ్ ఇన్స్పెక్టర్, చైన్‌మెన్‌ను వరంగల్ మహానగర సంస్థ కమిషనర్ రవి కిరణ్ తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
లంచం తిరిగి ఇస్తుండగా పట్టుకున్న అనిశా