వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గోపనపల్లికి చెందిన శెట్టి రవి, కామరత కుమార్తె... శెట్టి రవళిక సాహిత్యంలో గుర్తింపు తెచ్చుకుంది. తెలంగాణ మాండలికంలో రచనలు చేస్తూ ప్రముఖుల మన్ననలు పొండుతూ ఔరా అనిపిస్తుంది. ఏడో తరగతి చదువుతున్న సమయంలో తనలోని రచయిత్రిని గుర్తించిన ఉపాధ్యాయులు ఆమెను ప్రోత్సహించారు. తరగతిలోనే సాహిత్యంలో మెలకువలు నేర్చుకుని... అక్షరాలతో విన్యాసాలు చేస్తూ... తన కలం నుంచి జాలువారిన భావజాలంతో ఆలోచింపచేస్తూ.. ఎన్నో అవార్డులు సాధించింది. మారుమూల పల్లె నుంచి ప్రారంభమైన ఆమె ప్రస్థానం జాతీయ స్థాయికి చేరింది. అధ్యాపకులు, తల్లిదండ్రులు, గ్రామస్థుల సహకారంతో మంత్రుల చేతుల మీదుగా అవార్డులు అందుకుంది. ఇప్పటి వరకు వెయ్యికిపైగా కవితలు రాసిన రవళిక... ఎందరినుంచో ప్రశంసలు అందుకుంది.
నాకు చిన్నప్పటి నుంచి సాహిత్యం అంటే ఆసక్తి. హైస్కూలులో ఉన్నప్పుడు నేను రాసిన ఓ జవాబును చూసిన మా టీచర్... నాలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. నేను రాసిన మొదటి కవిత మనం దినపత్రికలో ప్రచురితమైంది. సామాజిక అంశాలే కవితా వస్తువుగా ఎక్కువ కవితలు రాశాను. ఇప్పటి వరకు వెయ్యికి పైగా కవితలు రాశాను. ఈ మధ్యకాలంలో ప్రక్రియలు కూడా ప్రారంభించాను. స్వరాలు, విజయశ్రీ, ముత్యాల పూసలు, తదితర ప్రక్రియలు రాస్తున్నాను. పద్మరత్నాలు ప్రక్రియలో శతకం పూర్తి చేసినందుకు పద్మకవి అవార్డు వచ్చింది. స్వరాలు ప్రక్రియలో శతకం పూర్తి చేసినందుకు స్వర సరస్వతీ పుత్రిక అనే అవార్డు వచ్చింది. నేను రాసిన కవితలను, సాహితీ సేవను గుర్తించి పుడమి జాతీయ వేదిక వాళ్లు డా.బీఆర్ అంబేడ్కర్ జాతీయ పురష్కారాన్ని అందించారు. బొజ్జ ఫౌండేషన్ వారు జాతీయ విశిష్ట సేవా పురష్కారం అందించారు. -రవళిక, యువ రచయిత్రి
అవే ఆమె కవితా వస్తువులు
రైతులు, యువత, మద్యపానం, మహిళలపై అఘాయిత్యాలు, బృూణహత్యలపై కవితలు రాసి తన అక్షరాలతో ఎందిరినో ఆలోచింపచేసింది. ఇటీవల బొజ్జా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో మంత్రుల చేతులమీదుగా జాతీయ విశిష్ట సేవాజ్యోతి అవార్డును అందుకుంది.
ఎన్ని ఇబ్బందులు వచ్చినా..