వరంగల్ నగరంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థి సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. హన్మకొండలోని అంబేడ్కర్ కూడలి వద్ద ఆన్లైన్ తరగతులను వ్యతిరేకిస్తూ కళ్లకు గంతలు కట్టుకుని వినూత్నంగా ధర్నా చేపట్టారు. కరోనా కష్టకాలంలో ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్లైన్ తరగతుల పేరిట విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజులు చెల్లించాలని ఒత్తిడికి గురి చేస్తున్నాయని ఆరోపించారు.
ఆన్లైన్ తరగతులను వ్యతిరేకిస్తూ ఏబీవీపీ నాయకుల ఆందోళన - abvp andholana
ఆన్లైన్ తరగతులను వ్యతిరేకిస్తూ వరంగల్ నగరంలో ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఆన్లైన్ తరగతుల పేరుతో ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు.
ఆన్లైన్ తరగతులను వ్యతిరేకిస్తూ ఏబీవీపీ నాయకుల ఆందోళన
ఆన్లైన్ తరగతుల వల్ల చిన్నారుల కంటి చూపు మందగించడంతో పాటు అనేక ఇతర సమస్యలు వస్తాయని తెలిపారు. పిల్లల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: కాకతీయ వైద్య కళాశాలలో కరోనా పరీక్షలు