హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా 60వ జాతీయ అథ్లెటిక్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు 100, రెండు వందలు, 400 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, హై జంప్, పోల్ వాల్ట్ తదితర ఈవెంట్లలో ప్రతిభ కనబరుస్తూ.. ఔరా అనిపిస్తున్నారు. సింథటిక్ ట్రాక్‌పై కొదమసింగంలా దూసుకెళ్తున్నారు.
క్రీడా పోటీలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్‌తో పాటు ఇతర ప్రతినిధులతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. 400 మీటర్ల పరుగును గన్‌ఫైర్ చేసి లాంఛనంగా మెుదలుపెట్టారు. క్రీడాకారులకు గత ప్రభుత్వాలు ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వలేదన్నారు. సంక్షేమ పథకాలతో సమానంగా.. క్రీడలకూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడించారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హామీ ఇచ్చారు. పోటీలు ముగిసిన తరువాత క్రీడాకారులంతా... రామప్ప, వేయిస్తంభాల గుడి.. ఇతర పర్యాటక ప్రాంతాలు సందర్శించే ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.
అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి..