వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో పరీక్ష రాయడానికి విద్యార్థులు అర్హత కోల్పోవడంపై అధికారుల బృందం విచారణ చేపట్టనుంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ అధికారులు ఇవాళ కళాశాలలో విచారించనున్నారు.
కేయూలో 245 మంది వైద్య విద్యార్థులపై అనర్హత.. విచారణ! - 245 students disqualified for exams At Kakatiya Medical College
కాకతీయ వైద్య కళాశాలలో పరీక్షలకు విద్యార్థులు అర్హత కోల్పోవడంపై డీఎంఈ అధికారులు విచారణ చేపట్టనున్నారు. తరగతులకు గైర్హాజరు కావడంతో 245 మందిపై అనర్హత వేసినట్లు సమాచారం.
పరీక్షలకు 245 మంది విద్యార్థుల అనర్హత... ఎందుకంటే?
తరగతులకు గైర్హాజరు కావడంతో... 245 మంది పరీక్ష రాయడానికి అర్హత కోల్పోయినట్లు తెలుస్తోంది. డీఎంఈ అధికారుల విచారణతో విద్యార్థుల భవితవ్యం తేలిపోనుంది. అర్హత కోల్పోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల అనర్హతపై ప్రిన్సిపల్‌ను వివరణ కోరగా మాట దాటవేశారు.