రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని 50 మందికి గాయాలు - accident news
10:01 January 13
రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో డ్రైవర్ల పరిస్థితి విషమం
వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్భపూర్ గ్రామ జాతీయ రహదారిపై ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వచ్చిన వరంగల్ 1డిపో బస్సు... కరీంనగర్ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో సుమారుగా 50 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరు బస్సు డ్రైవర్లు విషమ పరిస్థితిలో ఉన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్ లో హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి... మరికొంతమందిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
ఇదీచూడండి: రోడ్డు దాటుతుండగా... డీసీఎం ఢీకొని మహిళ మృతి