కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి తెలంగాణ ప్రజలకు అంకితం చేయడంపై... వరంగల్ నగరంలో తెరాస కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. పోచమ్మ మైదాన్ కూడలి వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సహస్ర కలశాభిషేకం నిర్వహించారు.
సర్వమతాల పోచమ్మ మైదాన్ కూడలి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. హన్మకొండ వైపు వెళ్లే మార్గంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. క్రైస్తవ సోదరులు కాశీబుగ్గ వైపుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజీపై ప్రార్థన చేశారు.
1000 కలశాలతో కేసీఆర్ చిత్రపటానికి అభిషేకం - 1000 కలశాలతో కేసీఆర్‌కి అభిషేకం
వరంగల్ అర్బన్ జిల్లాలోని పోచమ్మ మైదాన్ కూడలి వద్ద తెరాస శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. 1000 కలశాలతో కేసీఆర్ చిత్రపటానికి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని కలశాభిషేకం నిర్వహించారు.
1000 కలశాలతో కేసీఆర్‌కి అభిషేకం
ఇవీ చూడండి : కన్నెపల్లి పంపుహౌస్ నుంచి విడుదలైన జీవధార