వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో గులాబీ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. జడ్పీటీసీ స్థానాలను తెరాస అభ్యర్థులు కైవసం చేసుకోవడం వల్ల ఆ పార్టీ నేతలు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. నల్లబెల్లి మండలం జడ్పీటీసీగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న 5వేల 688 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఖానాపురం మండలంలో పత్తిని స్వప్న 1789 ఓట్లతో గెలుపొందింది. నెక్కొండ స్థానంలో సరోజన, దుగ్గొండి స్థానాన్ని శ్రీనివాస్ 9వేల 837 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నర్సంపేట జడ్పీటీసీగా జయ, చెన్నారావుపేట జడ్పీటీసీగా పత్తి నాయక్ విజయం సాధించారు.
ఓరుగల్లులో తెరాస శ్రేణుల సంబురాలు - trs
వరంగల్ గ్రామీణ జిల్లాలో కారు దూసుకెళ్లింది. జడ్పీటీసీ స్థానాల్లో తెరాస అభ్యర్థులు విజయభేరి మోగించడం వల్ల తెరాస శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.
ఓరుగల్లులో తెరాస శ్రేణుల సంబురాలు