తెలంగాణ

telangana

ETV Bharat / state

'పేదోడి పొట్ట కొట్టి పెద్దోడికి పెడుతోంది'

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని వరంగల్ రూరల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్‌ ఖండించారు. భాజపా ప్రభుత్వం సామాన్య ప్రజలపై విపరీతంగా భారం వేస్తోందని ఆరోపించారు. పేదోడి పొట్ట కొట్టి పెద్దోడికి పెడుతున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.

Warangal Rural District Youth Congress President Koyada Srinivas condemns Central Government hike in petrol and diesel prices
'పేదోడి పొట్ట కొట్టి పెద్దోడికి పెడుతోంది'

By

Published : Feb 16, 2021, 3:38 PM IST

సామాన్య ప్రజలపై పెనుభారం మోపుతూ కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకు చమురు ధరలు పెంచుతోందని వరంగల్ రూరల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్‌ విమర్శించారు. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా పరకాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెరాస ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.

దేశ జీడీపీ పెంచుతామని ఎన్నికల వాగ్దానం చేసిన భాజపా... వంట గ్యాస్ ధర పెంచుతోందని శ్రీనివాస్‌ ఆరోపించారు. కరోనాతో ఉపాధి కోల్పోయిన ప్రజలకు... పెరిగిన ధరలు భారంగా మారాయని అన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలు కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాసేలా ఉన్నాయని శ్రీనివాస్‌ విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంతవరకు పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బుర్ర దేవేందర్, రఘునందన్, రవి కుమార్, చిరంజీవి, సుమన్, రాజు, సురేందర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు!

ABOUT THE AUTHOR

...view details