రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మూడేళ్ల చిన్నారి గుక్కపట్టి ఏడుస్తున్నా... కనికరం లేకుండా నిందితుడు సంజయ్ బాబును బావిలో పడేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న తల్లి వద్ద ఏడుస్తున్న బాబును కిరాతకంగా హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయగా... 9 మందిని ఎలా హతమార్చాడో చెప్పాడు.
బావి ఘటన: నిందితుడు మూడేళ్ల బాబును ఎలా చంపాడంటే..? - గొర్రెకుంట బావి ఘటన తాజా వార్తలు
వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంట బావి ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు సంజయ్ మూడేళ్ల చిన్నారిని కనికరం లేకుండా బావిలో పడేసి హతమార్చినట్లు ఒప్పకున్నాడు.
మక్సూద్ ఇంట్లో వండిన ఆహారంలో నిద్ర మాత్రలు కలిపాడు. అది తిన్న మక్సూద్, ఆయన భార్య నిషా, కూతురు బుస్రా, కుమారులు షాబాద్, షాహెల్, మరో వ్యక్తి షకీల్ ఆహారం తిని అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అనంతరం గోదాము పైఅంతస్తులో ఉంటున్న శ్రీరామ్, శ్యామ్ వద్దకు వెళ్లి వారు వండుకున్న ఆహారంలోనూ నిద్ర మాత్రలు కలిపాడు. వారు దాన్ని తినగా మత్తులోకి వెళ్లారు.
తొలుత అయిదుగురిని గోనె సంచుల్లో వేసుకుని బావిలో పడేశాడు. అప్పటికే నిద్ర పోయిన మూడేళ్ల బబ్లూ లేచి అపస్మారక స్థితిలో ఉన్న తన తల్లి వద్దకు వెళ్లి గుక్క పట్టి ఏడుస్తుండగా.. పసి వాడనే కనికరం చూపకుండా ఎత్తుకెళ్లి బావిలో పడేసి హతమార్చాడు. మక్సూద్, ఆయన భార్య నిషా బరువుగా ఉన్నందున భుజాలకు తాళ్లు కట్టి లాక్కెళ్లినట్లు తెలిసింది. సీన్ రీ కన్స్ట్రక్షన్ తర్వాత నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు.
- సంబంధిత కథనాలు:ఆ బావిలో తొమ్మిది మృతదేహాలు..
- సంబంధిత కథనాలు:బావిలో లభ్యమైన మృతదేహాలకు శవపరీక్ష పూర్తి
- సంబంధిత కథనాలు:ఆపరేషన్ బావి
- సంబంధిత కథనాలు:నువ్వైనా చెప్పవే! ఎలా జరిగిందో... ఎవరు చేశారో..?
- సంబంధిత కథనాలు:బావి ఘటనలో దర్యాప్తు ఇలా సాగింది..
- సంబంధిత కథనాలు:9 కాదు 10 హత్యలు..!