వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఆర్టీసీ సమ్మె ప్రభావంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పరకాలలో 85 ఆర్టీసీ బస్సులు, 24 అద్దె బస్సులు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. 456 మంది కార్మికులు పూర్తి స్థాయిలో సమ్మెలో పాల్గొన్నారు. డిపో వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తామని పోలీసులు వెల్లడించారు. పండుగ వేళ బస్సులు బయటకు రాకపోవటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గరవుతున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మెను ఉద్ధృతం చేస్తామని కార్మికులు వెల్లడించారు.
పరకాలలో ఆగిన ప్రగతి రథ చక్రాలు - tsrtc bus strike today
డిమాండ్ల పరిష్కరమే లక్ష్యంగా ఆర్టీసీ కార్మికులు వరంగల్ రూరల్ జిల్లా పరకాల డిపోలో సమ్మె ప్రారంభించారు. జిల్లాలోని 85 ఆర్టీసీ బస్సులు, 24 ప్రైవేట్ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
పరకాలలో ఆగిన ప్రగతి రథ చక్రాలు