వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపాలిటీలో కారు జోరు కొనసాగించింది. మొత్తం 22 వార్డులున్న ఈ పురపాలికలో ఎన్నికలకు ముందే 11 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 11 వార్డులకు ఎన్నికలు జరగగా.. ఆరింటిని తెరాస కైవసం చేసుకొని గులాబీ జెండా ఎగరవేసింది.
బస్తీమే సవాల్: పరకాల పురపాలికలో తెరాస జెండా
పరకాల పురపాలికలో తెరాస జెండా ఎగురవేసింది. 11 వార్డులు ఏకగ్రీవం కాగా.. మరో 6 వార్డులు గెలుచుకొని పరకాల తనదే అని నిరూపించింది.
బస్తీమే సవాల్: పరకాల పురపాలికలో తెరాస జెండా
మూడింట భాజపా గెలుపొందగా.. ఒక వార్డును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరొక వార్డును ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకుంది.
ఇవీ చూడండి: 27న పరోక్ష ఎన్నిక.. నేటి సాయంత్రం నుంచి ప్రత్యేక నియమావళి