స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా కార్యాలయాల వద్ద నిర్మాణాలపై మాత్రం దృష్టి సారించట్లేదు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని రెవెన్యూ ,ఎంపీపీ తదితర కార్యాలయాలకు 39 గ్రామాల నుంచి వివిధ పనుల నిమిత్తం నిత్యం జనం వస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అధికారుల కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. మల, మూత్ర విసర్జనకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.
'వెంటనే శౌచాలయాలు నిర్మించాలి' - undefined
వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సౌకర్యాలు లేక ఆరు బయట మల,మూత్ర విసర్జనలకు వెళ్తున్నారు. వెంటనే ఆయా కార్యాలయాల్లో శౌచాలయాలు నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
'వెంటనే శౌచాలయాలు నిర్మించాలి'
పురుషులు కార్యాలయ ఆవరణలో మల మూత్రాలకు వెళ్తున్నా...మహిళలకు మాత్రం తీవ్ర అసౌకర్యం తప్పట్లేదు. ఆరు బయట మల, మూత్ర విసర్జనలు చేయడం వల్ల పారిశుద్ధ్య లోపం తలెత్తుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో మరుగుదొడ్లు నిర్మించాలని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
TAGGED:
toilets