తెలంగాణ

telangana

ETV Bharat / state

వాటర్​ ట్యాంక్​పై నుంచి పడి కూలీకి గాయాలు - మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంక్‌

వరంగల్​ గ్రామీణ జిల్లాలో నిర్మాణంలో ఉన్న వాటర్​ ట్యాంక్​పై నుంచి పడి ఓ కూలీకి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

కూలీకి గాయాలు

By

Published : May 12, 2019, 4:01 PM IST

నూతనంగా నిర్మిస్తున్న మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంక్‌ నుంచి పడి ఓ కూలీకి తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్‌ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో గత కొద్ది రోజులుగా మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణాన్ని చేపట్టారు. జనగాం జిల్లా నర్మెట్ట మండలం మంచ్యా తండాకు చెందిన భూక్యకీడ అక్కడ కూలీ పనులు చేస్తున్నాడు. ట్యాంక్‌పైకి ఎక్కిన అతడు జారీ పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details