వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో దళిత మరియు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులకు భవిష్యత్తుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులంతా చాలా జాగ్రత్తతో మెలగాలని నేతలు సూచించారు. ఆడవాళ్లను గౌరవించటం చిన్ననాటి నుంచే అలవర్చుకోవాలన్నారు. దిశా లాంటి ఘటనలు అవగాహన లేని కొందరు మూర్ఖుల వల్ల జరుగుతున్నాయన్నారు. అలాంటి వారికి పాఠశాల దశ నుంచే అమ్మాల పట్ల గౌరవంగా ఉండటం నేర్పించాలన్నారు. భవిష్యత్తులో ఉత్తమ స్థితిలోకి వెళ్లాలంటే కౌమారదశలో విద్య మీద దృష్టి పెట్టడం ఎంతో అవసరమని విద్యార్థులకు నాయకులు వివరించారు.
'అమ్మాయిలను గౌరవించటం చిన్నప్పటి నుంచే నేర్పించాలి'
దిశాలాంటి ఘటనలు అవగాహన లేని కొంత మంది మూర్ఖుల వల్ల జరుగుతున్నాయని విద్యార్థి సంఘాల నేతలు పేర్కొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో జరిగిన అవగాహన కార్యక్రమంలో విద్యార్థులకు భవిష్యత్ పట్ల పలు సూచనలు సలహాలు చేశారు.
STUDENT ORGANIZATION MEETING WITH COLLAGE STUDENTS IN PARAKALA