తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​ రూరల్​లో ప్రశాంతంగా పోలింగ్​ - వరంగల్​ రూరల్​లో ప్రశాంతంగా పోలింగ్​

వరంగల్​ రూరల్​ జిల్లాలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఓటర్లకు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

polling-in-rayaparthi

By

Published : May 10, 2019, 3:16 PM IST

స్థానిక సంస్థలకు జరుగుతున్న రెండో విడత ఎన్నికలు వరంగల్​ రూరల్​జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయి. రాయపర్తి మండలంలో ఏర్పాటు చేసిన 98 పోలింగ్​ కేంద్రాల్లో పోలింగ్​ ప్రక్రియ సజావుగా సాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్​ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. వృద్ధులు సైతం ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మండలంలో మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలుండగా రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 14 స్థానాలకు పోలింగ్​ నిర్వహిస్తున్నారు.

వరంగల్​ రూరల్​లో ప్రశాంతంగా పోలింగ్​

ABOUT THE AUTHOR

...view details