ఓ వ్యక్తి మర్చిపోయిన లాప్‌టాప్‌ను కొద్ది సమయంలో పోలీసులు తిరిగి అతనికి అప్పగించిన సంఘటన వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల పట్టణంలో జరిగింది. ఆ వస్తువు విలువ రూ. 30 వేలు ఉంటుందని బాధితుడు తెలిపాడు.
మర్చిపోయిన లాప్‌టాప్‌ను తిరిగి అప్పగించిన పోలీసులు - వరంగల్ రూరల్ జిల్లా తాజా వార్తలు
హోటల్లో టిఫిన్ చేసిన వ్యక్తి తన లాప్టాప్ మర్చిపోగా.. తిరిగి ఆ వస్తువును కొద్ది సమయంలోనే పోలీసులు అతనికి అప్పగించారు. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో జరిగింది.
జిల్లాలోని దుగ్గొండి మండలం పోనకల్ గ్రామానికి చెందిన సుమన్ అనే వ్యక్తి టేకుమట్ల మండలం అసిరెడ్డి పల్లి గ్రామానికి వెళ్తున్న క్రమంలో పరకాల పట్టణంలోని ఓ హోటల్లో టిఫిన్ చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లే సమయంలో అతని లాప్‌టాప్‌ను మర్చిపోయాడు. మళ్లీ హోటల్‌కు వెళ్లి వెతకగా అది దోరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించిన పోలీసులు లాప్‌టాప్‌ను గుర్తించి బాధితుడికి అందజేశారు. అతి తక్కువ సమయంలోనే తన వస్తువును గుర్తించి తనకు అప్పగించిన పోలీసులకు సుమన్ కృతజ్ఞతలు తెలిపాడు.
ఇదీ చదవండి:కేంద్రం రిజర్వేషన్లు తొలగిస్తోందని అసత్య ప్రచారం: రఘునందన్