తెలంగాణ

telangana

ETV Bharat / state

బావిలో ఇంకెవ్వరి మృతదేహాలు లేవు - సంగెం మండలంలో బావిలో పడిన జీపు

వరంగల్ గ్రామీణ జిల్లాలో అదుపు తప్పి బావిలో పడిన జీపు ఘటనకు సంబంధించి... రాత్రంతా గాలింపు చర్యలు కొనసాగాయి. ఈ దుర్ఘటనలో పది మంది సురక్షితంగా బయటపడగా.... జీపు డ్రైవర్ మృతదేహం బయటకు తీశారు. బావిలో మృతదేహాలు లేకపోవడం వల్ల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

బావిలో ఇంకెవ్వరి మృతదేహాలు లేవు
బావిలో ఇంకెవ్వరి మృతదేహాలు లేవు

By

Published : Oct 28, 2020, 9:52 AM IST

వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం గవిచర్లలో బావిలో గల్లంతైన వారి కోసం అధికారుల చేపట్టిన గాలింపు చర్యలు ముగిశాయి. బావిలో మరే మృతదేహాలు లభించకపోవండ వల్ల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో వరంగల్ నుంచి నెక్కొండకు ప్రయాణీకులతో వెళుతున్న జీపు అదుపు తప్పి రోడ్డుపక్కనే ఉన్న బావిలోకి దూసుకుపోయింది. ఘటనలో డ్రైవర్​ మృతి చెందగా... పదిమంది సురక్షితంగా బయటపడ్డారు.

ప్రమాదంలో మరెవరైనా జీపులో ఉండొచ్చనే అనుమానంతో రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టారు. బావిలో నీటిని పూర్తిగా తోడేశారు. ఎలాంటి ఆధారాలు గాని... మృతదేహాలు దొరకలేదు.

ఇదీ చూడండి:బావిలోకి దూసుకెళ్లిన జీపు.. డ్రైవర్​ మృతి, మరో ముగ్గురు గల్లంతు

ABOUT THE AUTHOR

...view details