రైతు వేదికల నిర్మాణాలను దసరాలోపు పూర్తిచేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో పరకాల నియోజకవర్గ పనులపైనా సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఇంకా మొదలుపెట్టని రైతువేదికల నిర్మాణ పనులను వెంటనే మొదలుపెట్టి వేగవంతం చేయాలని సూచించారు. నాణ్యత విషయంలో రాజీపడకుండా ఉండాలని గుత్తేదారులను ఆదేశించారు. అలాగే గ్రామాల్లో జరుగుతున్న సీసీ రోడ్డు పనులు కూడా త్వరతగతిన పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.
నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. అతిత్వరలో పూర్తిస్థాయిలో అన్ని ఇళ్లు పూర్తి చేసి లబ్దిదారులకు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
'దసరాలోపు రైతు వేదికలను పూర్తి చేయాలి' - raithu vedhika
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణాలను దసరాలోపు పూర్తిచేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. నాణ్యత విషయంలో రాజీపడకుండా ఉండాలని గుత్తేదారులను ఆదేశించారు.
'దసరాలోపు రైతు వేదికలను పూర్తి చేయాలి'