వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలంలో ప్యాసింజర్ జీపు అదుపుతప్పి బోరు బావిలోకి దూసుకెళ్లిన ఘటనా స్థలిని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పదిమంది సురక్షితంగా బయటపడ్డారు. ఘటనలో ఇంకా ఎవరైనా మృతి చెంది ఉంటారనే అనుమానంతో రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టారు.
జీపు ప్రమాదం క్షతగాత్రులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే ధర్మారెడ్డి - వరంగల్ వార్తలు
సంగెం మండలం గవిచర్ల వద్ద మంగళవారం సాయంత్రం జీపు అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లిన ఘటనాస్థలిని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
జీపు ప్రమాదంలో క్షతగాత్రులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే ధర్మారెడ్డి
ప్రమాదంలో ఒకరే మృతిచెందారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. యుద్ధప్రాతిపదిక సహాయక చర్యలు చేపట్టిన సిబ్బందిని, స్థానిక ప్రజాప్రతినిధులను అభినందించారు.
ఇదీ చూడండి:బావిలోకి దూసుకెళ్లిన జీపు.. డ్రైవర్ మృతి, మరో ముగ్గురు గల్లంతు