ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలో రహదారి పనులకు శంకుస్థాపన చేశారు.
'గిరిజనుల ఇళ్లలో వెలుగునింపిన ఘనత కేసీఆర్‌దే'
ముఖ్యమంత్రి కేసీఆర్ తండాలను పంచాయతీలుగా చేసి, గిరిజనుల అభివృద్ధికి కృషి చేశారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గిరిజన కుటుంబాల్లో వెలుగు నింపిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు.
'గిరిజనుల ఇళ్లలో వెలుగునింపిన ఘనత కేసీఆర్‌దే'
నిత్యం నియోజకవర్గ అభివృద్ధి కోసం పరితపించే ఎమ్మెల్యే ఉండటం ప్రజల అదృష్టమని కూడా ఛైర్మన్ మర్రి యాదవరెడ్డి కొనియాడారు. సీఎం కేసీఆర్ సాయంతో ఎమ్మెల్యే ధర్మారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలబెట్టారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా మండలంలోని విశ్వనాథపురం,కొమ్మాల గ్రామ పంచాయతీలకు ఎమ్మెల్యే ధర్మారెడ్డి ట్రాక్టర్లను పంపిణీ చేశారు.