తెలంగాణ

telangana

ETV Bharat / state

చెరువులో గల్లంతైన వ్యక్తి కోసం ముమ్మరంగా గాలింపు - వరంగల్​ రూరల్​ జిల్లా తాజా వార్తలు

వర్ధన్నపేట శివారు కోనారెడ్డి చెరువు వరద నీటిలో గల్లంతైన వ్యక్తి జాడ దొరకలేదు. శుక్రవారం చేపల వేటకు వెళ్లిన రాజేందర్ గల్లంతయ్యాడు.

చెరువులో గల్లంతైన వ్యక్తి కోసం ముమ్మరంగా గాలింపు
చెరువులో గల్లంతైన వ్యక్తి కోసం ముమ్మరంగా గాలింపు

By

Published : Aug 23, 2020, 5:37 AM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట శివారు కోనారెడ్డి చెరువులో గల్లంతైన వ్యక్తి జాడ లభించలేదు. జఫర్​ఘడ్​ మండలం హిమ్మత్​నగర్​కు చెందిన రాజేందర్​ శుక్రవారం... చెరువులో చేపలవేటకు వెళ్లి గల్లంతయ్యాడు. స్థానికులు ఎంతవెతికిన ఆచూకీ లభించకపోవడం వల్ల స్థానిక ఎమ్మెల్యే రమేశ్​కి సమాచారం అందించారు.

స్పందించిన ఎమ్మెల్యే రమేశ్​... ఎన్డీఆర్​ఎఫ్ బృందాన్ని రప్పించి గాలింపు చేపట్టారు. సుమారు ఐదు కిలోమేటర్ల మేర జల్లెడ వేసినా ఆచూకీ దొరకలేదు.

ఇదీ చూడండి:ఉద్యోగం రాలేదని రైలుకింద పడి యువకుడు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details