వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 36వ డివిజన్ పరిధి ఇందిరమ్మ కాలనీవాసులకు లోడి సామాజిక సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ హాజరయ్యారు.
పేదలకు నిత్యావసర సరకుల పంపిణీ - ఎమ్మెల్యే వినయభాస్కర్ తాజా వార్తలు
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రభుత్వం సకాలంలో స్పందించడం వల్ల భారీ ముప్పు తప్పిందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 36 వ డివిజన్ పరిధి ఇందిరమ్మకాలనీలోని పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వినయ భాస్కర్
వర్షాలు, వరదల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సకాలంలో స్పందించి జిల్లా యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం వల్ల భారీ ముప్పుతప్పిందని పేర్కొన్నారు. కష్టకాలంలో పేదలకు సేవా కార్యక్రమాలు చేస్తున్న లోడి సామాజిక సంస్థ నిర్వాహకులను అభినందించారు.