బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడంతో గ్రామాల్లో శ్మశానవాటికలు, డంపింగ్ యార్డులు నిర్మించిన సర్పంచిలు తీవ్ర ఆవేదన చెందుతున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా పల్లె, పట్టణ ప్రగతి సన్నాహక సభలో ఆయన పాల్గొన్నారు.
అధికారులు పనుల బిల్లులు చెల్లించే విషయంలో తాత్సారం చేయకూడదని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు. ఈ విషయంలో అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన అన్నారు. గ్రామ స్థాయిలో పని చేసే పంచాయతీ కార్యదర్శులు పైఅధికారుల ఒత్తిడితో భయం భయంగా బతుకుతున్నారని పేర్కొన్నారు.