పరకాల పట్టణం జి.ఎస్.ఆర్ గార్డెన్స్‌లో పనిచేస్తున్న 124మంది గుమాస్తాలకు ఇళ్ల పట్టాలు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పంపిణీ చేశారు. ప్రభుత్వం ద్వారా సీసీ రోడ్లు, నల్లా కనెక్షన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
ఆ స్థాయి నుంచే..
గుమాస్తాగా పనిచేసే వారి కష్టాలేంటో అది అనుభవించిన వారికే తెలుస్తుందని అన్నారు. ఆయనా ఆ స్థాయి నుంచే వచ్చిన వాడినేనని తెలిపారు. పట్టాలు అందివ్వడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.