కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎలాంటి లాభం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. దేశరాజధాని దిల్లీలో రైతులు నెలరోజులకుపైగా పోరాటం చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడం బాధాకరమన్నారు.
రైతుల పట్ల కేంద్రం తీరు శోచనీయం : ఎర్రబెల్లి - రైతు వేదికలను ప్రారంభించిన మంత్రి
వరంగల్ గ్రామీణ జిల్లాలో ప్రభుత్వం నిర్మించిన రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, రెండుపడక గదుల ఇళ్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. పలు గ్రామాల్లో విస్త్రృతంగా ఆయన పర్యటించారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలతో రైతులకు ఒరిగేదేమి లేదని మంత్రి విమర్శించారు.

రైతు వేదికల ప్రారంభం
రైతు వేదికల ప్రారంభం
రాయపర్తి మండలంలో పర్యటించిన మంత్రి...కేశవాపురం, మురిపిరాల, కాట్రపల్లి, పెరకవీడులో రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎర్రబెల్లి కొనియాడారు.