తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించాలి' - sanitation program in villages

వరంగల్​ గ్రామీణ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి విస్తృతంగా పర్యటించారు. పర్వతగిరి మండలంలోని పలు గ్రామాలను సందర్శించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించి... అధికారులకు పలు సూచనలు చేశారు. అంటు వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

'ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించాలి'
'ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించాలి'

By

Published : Jun 1, 2020, 12:46 PM IST

పల్లె ప్రగతి కొనసాగింపుగా నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు వరంగల్ గ్రామీణ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. పర్వతగిరి మండల పరిధిలోని పలు గ్రామాలను ఆకస్మిక తనిఖీలు చేసి... పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మురికి కాలువలను సమర్థవంతంగా నిర్వహించాలని సర్పంచ్, గ్రామ కార్యదర్శి, సిబ్బందిని మంత్రి ఆదేశించారు. కాలువలు శుభ్రంగా లేకపోతే, దోమలు, దుర్గంధం పెరిగి.. అంటువ్యాధులు ప్రబలుతాయని వివరించారు. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించాలన్నారు. అనంతరం అర్టీసీ బస్సును తనిఖీ చేసి.. తీసుకుంటున్న జాగ్రత్తలను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో పరిశుభ్రతను పాటించాలని.. మాస్కులు లేని ప్రయాణికులను బస్సుల్లో అనుమతించవద్దని.. నిర్ణిత సంఖ్యలో మాత్రమే ప్రయాణికులను అనుమతించాలని డ్రైవర్, కండక్టర్​కు మంత్రి ఎర్రబెల్లి సూచించారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో మరో 199 కరోనా పాజిటివ్‌ కేసులు... ఐదుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details