కరోనా వ్యాప్తి కట్టడిపై అలసత్వం వహిస్తే... కఠిన చర్యలు తప్పవని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హెచ్చరించారు. వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో..... రాష్ట్రంలోని అన్ని స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులు, అధికారులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.
అలసత్వం వహిస్తే కఠిన చర్యలే: మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ రూరల్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు.
గ్రామాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా కట్టడి చర్యలు సమర్ధవంతంగా చేపట్టాలని.... అందరూ టీకాలు మాస్కులు ధరించేలా చూడాలని అన్నారు. వ్యాక్సిన్ వేయించుకోని వారంతా తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత ఏడాదిలాగే ఈసారీ డ్వాక్రా సంఘాలు మాస్కులు తయారు చేసే విధంగా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని.... బహిరంగ ప్రదేశాల్లో సోడియం హైపో క్లోరైడ్ పిచికారీ చేయాలని పేర్కొన్నారు.
ఇవీచూడండి:సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్