తెలంగాణ

telangana

ETV Bharat / state

75 ఏళ్లు బ్రహ్మచారిగా ఉద్యమం చేశారు: మంత్రి ఎర్రబెల్లి

బడుగు బలహీనవర్గాల అభివృద్ది కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషి ఎనలేనిదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. స్వరాష్ట్రం కోసం 75ఏళ్లు బ్రహ్మచారిగా ఉద్యమం చేశారని కీర్తించారు.

75 ఏళ్లు బ్రహ్మచారిగా ఉద్యమం చేశారు: మంత్రి ఎర్రబెల్లి
75 ఏళ్లు బ్రహ్మచారిగా ఉద్యమం చేశారు: మంత్రి ఎర్రబెల్లి

By

Published : Sep 21, 2020, 4:18 PM IST

బడుగు బలహీనవర్గాల అభివృద్ది కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషి ఎనలేనిదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తిలో తెలంగాణ స్వాంత్రంత్య సమరయోధులు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

తెలంగాణ కోసం తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన నిబద్ధత గల రాజకీయవేత్త అని మంత్రి ఎర్రబెల్లి కొనియాడారు. స్వరాష్ట్రం కోసం 75ఏళ్లు బ్రహ్మచారిగా ఉద్యమం చేసిన ఆయన బడుగు బలహీనవర్గాల అభివృద్ది కోసం ఎనలేని కృషి చేశారని కీర్తించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయ ఏర్పాటుకు తాను ఉంటున్న జల దృశ్యాన్ని అప్పగించిన మహోన్నత వ్యక్తిగా.. కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు.

ఇదీ చదవండి:ప్రొఫెసర్​ జయశంకర్​ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి

ABOUT THE AUTHOR

...view details