వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో మండల పరిధిలోని పురోహితులకు, పాస్టర్లకు, ఇమామ్‌లకు, నిరుపేదలకు అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు అందజేశారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సరకులు పంపిణీ చేశారు.
నిరుపేదలకు అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆపన్నహస్తం - aroori gattumallu foundation
నిరుపేదలకు అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ అండగా నిలుస్తోంది. వరంగల్ గ్రామీణ జిల్లా ఇల్లంద గ్రామంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
నిరుపేదలకు అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆపన్నహస్తం
కరోనా కష్టకాలంలో స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్ అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ద్వారా నిరుపేదలను ఆదుకోవడం అండగా నిలవడం అభినందనీయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కితాబిచ్చారు. ఇలాంటి సేవలు ఇంకా కొనసాగించాలని ఎమ్మెల్యే రమేష్‌ను మంత్రి కోరారు.
ఇవీ చూడండి: ఉపాధి కోల్పోయిన వారికి అండగా నిలిచిన ఇద్దరు చిన్నారులు