తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాను నిర్లక్ష్యం చేస్తే.. ప్రాణాలు పోతాయి: మంత్రి - వరంగల్ గ్రామీణ జిల్లాలో పారిశుద్ధ్య పనుల పరిశీలన

రాష్ట్రంలో కరోనా వైరస్​ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. వరంగల్ గ్రామీణ జిల్లాలో పర్యటించి.. పారిశుద్ధ్య పనులను మంత్రి పరిశీలించారు.

Minister Dayakar Touring the Warangal Rural District.
'నిబంధనలు సడలిస్తే.. కరోనా తగ్గినట్లు కాదు'

By

Published : Jun 8, 2020, 6:42 PM IST

కరోనా విజృభిస్తున్న నేపథ్యంలో.. జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలు పోతాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. వరంగల్ గ్రామీణ జిల్లాలో పర్యటించి.. పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం రాయపర్తి మండలం మొరిపిరాల క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన జడ్పీటీసీ మాజీ సభ్యుడు, దివంగత భూక్యా విజయ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.. అక్కడే వారి కుటుంబ సభ్యులను పరామర్శించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

లాక్​డౌన్​ నిబంధనలు సడలించినంత మాత్రాన కరోనా తగ్గినట్లు కాదని మంత్రి అన్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రాదవద్దని.. భౌతికదూరం పాటించి, మాస్కు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.

ఇదీ చూడండి:తీవ్ర ఉత్కంఠ.. ముఖ్యమంత్రి నిర్ణయం కోసం ఎదురుచూపు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details