వరంగల్ గ్రామీణ జిల్లా శాయంపేట పోలీస్ స్టేషన్ను పరకాల ఏసీపీ శ్రీనివాస్ సందర్శించారు. సిబ్బంది అందరికీ డాక్టర్ నాగ శశికాంత్, వారి బృందంచే వైద్య పరీక్షలు నిర్వహించి హైడ్రో క్లోరోక్విన్ టాబ్లెట్స్ ఇచ్చారు. ఆ తర్వాత సిబ్బంది అందరికీ సీపీ ఆదేశాలను, సూచనలను, పంచ సూత్రాలను తెలియజేశారు.
పోలీసులకు వైద్య పరీక్షలు, రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ - పరకాల ఏసీపీ శ్రీనివాస్
లాక్డౌన్ సమయంలో వరంగల్ గ్రామీణ జిల్లా శాయంపేటలో విధులు నిర్వహించిన పోలీసు సిబ్బందిని పరకాల ఏసీపీ శ్రీనివాస్ కలిశారు. వారికి వైద్య పరీక్షలు చేయించి హైడ్రో క్లోరోక్విన్ టాబ్లెట్స్ అందజేశారు. మండలంలో ఉన్న రౌడీషీటర్లందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు.
మండలంలో ఉన్న రౌడీషీటర్లందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఏ రౌడీషీటర్ కూడా ఏలాంటి సంఘవిద్రోహ చర్యలకు పాల్పడకూడదని హెచ్చరించారు. భూ పంచాయతీలు, తగాదాల్లో తలదూర్చకూడదని సూచించారు. క్రమశిక్షణ కలిగి ఎవరి పనులు వారు చేసుకోవాలన్నారు. లాక్డౌన్ సమయంలో నియమ నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. మాస్కులు లేకుండా ఎవరైనా కనిపించినట్లైతే వారిపై కేసు నమోదు చేసి రూ. 1000 ఫైన్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్ రావు, ఎస్ఐ ప్రవీణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి :ఈనాడు-ఈటీవీ భారత్ చొరవ.. వలస కూలీలకు ఎర్రబెల్లి చేయూత