తెలంగాణ

telangana

ETV Bharat / state

మావోయిస్టు కొరియర్​ అరెస్టు - warangal rural district

మావోయిస్టు కొరియర్​గా పనిచేస్తున్న వేల్పుల రమేశ్​ను పరకాల పోలీసులు అరెస్టు చేశారు. గతంలో అతను మావోయిస్టులకు పూర్తి స్థాయిలో సాయం చేశాడని పోలీసులు తెలిపారు.

mavoist courier arrested in warangal rural district
మావోయిస్టు కొరియర్​ అరెస్టు

By

Published : Mar 24, 2020, 7:43 PM IST

వరంగల్ రూరల్ జిల్లా నడికూడకు చెందిన వేల్పుల రమేశ్​ అనే మావోయిస్టు కొరియర్​ను పరకాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను గత కొంత కాలం నుంచి మావోయిస్టు దామోదర్​కు కొరియర్​గా పనిచేస్తూ... మావోయిస్టు పార్టీకి డబ్బులు సరఫరా చేశాడని పోలీసులు తెలిపారు. గతంలో రమేశ్​ మావోయిస్టులకు పూర్తి స్థాయిలో సాయం చేశాడని చెప్పారు.

అతనిని అరెస్ట్ చేసే క్రమంలో అతని ఇంట్లో విప్లవ సాహిత్యం, దామోదర్ రాసిన లేఖలు దొరికాయని వెల్లడించారు. ఇలాంటి వారు ఇకనైనా ప్రజల్లో కలిసిపోయి జీవించాలని పోలీసులు కోరారు.

మావోయిస్టు కొరియర్​ అరెస్టు

ఇవీ చూడండి: 'సానూకుల ధోరణితో వైరస్​ను పారదోలుదాం'

ABOUT THE AUTHOR

...view details